పుంగనూరులోజాతీయ జెండరూపకర్త పింగళికి నివాళులు
పుంగనూరు ముచ్చట్లు:
జాతీయజెండాను రూపకల్పన చేసిన పింగళివెంకయ్యకు ఘన నివాళులర్పించారు. శుక్రవారం మండలంలోని పూజగానిపల్లె హైస్కూల్ హెచ్‌ఎం రియాజున్నిసా ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ చేసి , గౌరవ వందనం చేశారు. అలాగే పింగళివెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. హెచ్‌ఎం మాట్లాడుతూ జాతీయజెండాను రూపకల్పన చేసిన పింగళివెంకయ్య 1921 మార్చి 31 న ఆల్‌ఇండియా కాంగ్రెస్ సమావేశంలో జెండాను మహాత్మగాంధికి అందజేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలు ఆలాపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రమీల, సుమతి, ఉమా, పురుషోత్తంరాజు, మునివెంకటరెడ్డి, మహబూబ్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Tributes to Pingali, the designer of the national flag in Punganur
