Natyam ad

ప్రకాశం పంతులుకు ఘనంగా నివాళులు

విశాఖ ముచ్చట్లు:


స్వాతంత్ర సమరయోధులు, ధీశాలి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా విశాఖలో వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.వైసీపీ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్,టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,మాజీ మంత్రి,ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రావు,పార్టీ నేతలు పాల్గొని పూల మాలతో అంజలి ఘటించారు.26న విశాఖలో సిఎం జగన్ పర్యటనకు సంబందించి ఏర్పాట్లుపై చర్చించామని చెప్పారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీర ప్రాంత సమీపాన ఉన్న విశాఖ వేదికకగా అమెరికన్ కంపెనీతో ఒప్పందం జరుగుతుందని,తీర ప్రాంతాన ఉన్న దేశంలో సుదీర్షమైన బీచ్ పరిరక్షణకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని చెప్పారు.
విశాఖ నుంచి భీమిలి వరకూ 39 తీర ప్రాంతాల్లో వ్యర్ధాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి అమర్ తెలిపారు.బీచ్ పరిసర ప్రాంతాల పరిరక్షణ కోసం 25వేల మందితో ప్లాస్టిక్ సేకరించడం జరుగుతుందని,సాగర తీర పరిరక్షణ కోసం అమెరికా కు చెందిన పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని,సాగర గర్భంలోనూ,

 

 

 

తీరం వెంబడి ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని పార్లే సంస్థ సేకరించి.. వాటిని రీ సైకిల్‌ చేసేందుకు ఈ సంస్ధతో ఒప్పందం జరుగుతుందని చెప్పారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ.. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న 5 వేల మందికి ఉపాధి శిక్షణ ఇచ్చిందని, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సీఎం జగన్‌  సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు తెలిపారు.కరణం ధర్మశ్రీ కూడా జనసేన అధినేత పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ది జనసేన కాదు.. ధనసేన. పేమెంట్‌ రాగానే పవన్‌ మూమెంట్‌ మారింది. పవన్‌ కల్యాణ్‌ టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల్లో జనసేన పట్ల నిరాధారణతో ఉందని,విధి విధానాలు లేని పార్టీ జనసేన అని,వైసీపీపై బురద జల్లే పనిగా పెట్టుకున్నారని అన్నారు.పోటీ చెయ్యడంలోనూ స్పష్టత లేకుండా పూటకొక మాట్లాడుతున్నారని ఎద్దెవ చేశారు.

 

Post Midle

Tags: Tributes to Prakasam Panthi

Post Midle