పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయులకు ఘన నివాళులు
పుంగనూరు ముచ్చట్లు:
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయుల వర్ధంతిని బలిజకులస్తులు నిర్వహించారు. మంగళవారం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌లో ఆయన చిత్రపటాన్ని పెట్టి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ నాయకులు నానబాలగణేష్, పూలత్యాగరాజు ఆధ్వర్యంలో బలిజకులస్తులు కృష్ణదేవరాయుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘ నాయకులు నానబాలమణి, జయరాం, కొండవీటినటరాజ, రమేష్, రామకృష్ణ, కొండవీటి నరేంద్ర, రమణ, కుమార్, మోహన్‌కుమార్, మురళి, సుబ్రమణ్యం, మనోహర్, ముత్యాలు, సుబ్బరాయప్ప తదితరులు పాల్గొన్నారు.
Tags: Tributes to Sri Krishna Devaraya in Punganur

