Natyam ad

అమరులకు నివాళులు

విశాఖపట్నం ముచ్చట్లు:


దేశ విభజన సమయంలో అమరులైన వారికి విశాఖలో పలువురు ఘనంగా నివాళులర్పించా రు. ఆగస్టు 14న దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా… విభజన సమయంలో మరణం పొందిన వారి త్యాగాలను స్మరిస్తూ విశాఖ రైల్వే శాఖ దేశ విభ జన విషాద స్మృతి దినం నిర్వహించింది.ఈ కార్యక్ర మంలో ఎంపి ఎంవివి సత్యన్నారాయణ, ఎమ్మెల్సీ మాధవ్,ఎమ్మెల్యే గణబాబు,విశాఖ వాల్తేర్ డిఆర్ఎం అనూప్ కుమార్,రైల్వే అధికారులు పాల్గోన్నారు. విభజన వేళ అమరులైన త్యాగాలను గుర్తుచేసుకు నేందుకు ఆగస్టు 14ను దేశ విభజన విషాద స్మృతి దినంగా గతేడాది ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవి భజన సమయంలో ఆగస్టు14న చెలరేగిన హింసలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా విషాద స్మృతి దినం నిర్వహించి దేశ స్వాతంత్ర్య సమయంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి స్వేచ్చను ప్రసాదించిన వారిని దైర్యసాహాసా లను ఈ సందర్బంగా వారు కొనియాడారు.

 

Tags: Tributes to the immortals

Post Midle
Post Midle