పారిపోవడానికి ప్రయత్నించారు

Tried to flee

Tried to flee

Date:06/12/2019

హైదరాబాదు ముచ్చట్లు:

దిశ కేసులో సైంటిఫిక్ ఆధారాలు సేకరించామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సైంటిఫిక్ ఆధారాలతో  నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో  చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. 4వ తేదీన నిందితులను చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నామన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం దిశ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశామన్నారు. కేసులో నిందితులను అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నాం. తరువాత శాస్త్రియ సాక్షాధారాలను సేకరించాం.ఘటనా స్థలానికి నిందితులను తీసుకుపోయాం. అప్పుడు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులనుంచి లాక్కున్న రెండు తూపాకులతో కాల్పులుజరిపారు. ఒక ఎస్సై, ఒక కానిస్టుబుల్ కు గాయాలయ్యాయని అయన వెల్లడించారు.  మొదట ఆరీఫ్,కాల్పులు జరిపాడు. పోలీసుల కాల్పుల్ల నలుగురు హతమయ్యారని అయన అన్నారు.

 

బాధ్యతలు చేపట్టిన స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్

 

Tags:Tried to flee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *