Natyam ad

త్రినాధరావు నక్కిన, ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 5 అనౌన్స్ మెంట్

హైదరాబాద్ ముచ్చట్లు:

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్. ఆయన గత చిత్రం ధమాకా 2022లో బిగ్గెస్ట్  బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌తో త్రినాథరావు నక్కిన చేతులు కలిపారు. త్రినాధరావు నక్కిన , ప్రొడక్షన్ బ్యానర్‌కి ఇది నెక్స్ట్  ప్రాజెక్ట్. భారీ బడ్జెట్‌తో ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఐరా క్రియేషన్స్  ప్రొడక్షన్ నంబర్ 5 దర్శక, నిర్మాతలకు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది. ఈరోజు ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. హీరో, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.

 

Post Midle

Tags; Trinadha Rao Nakkina, Aira Creations Production No. 5 Announcement

Post Midle