భక్తి శ్రద్దలతో వైకుంఠ ఏకాదశి

వేములవాడ ముచ్చట్లు:
 
వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్బంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో భక్తులకు అనుమతి లేకుండా అంతరంగికముగా పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారంలో  శివకేశవులను దర్శించుకోవడాని తోపులాట విదంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి రాష్ట్రంలో కరొనా, ఓమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వము  జారీ చేసిన జి. ఓ. యం యస్. 01,  ఆదేశములననుసరించి శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానము, వేములవాడ యందు జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవ కార్యక్రమములకు భక్తులను అనుమతిని రద్దు చేయడంతో పరిమితి భక్తులతో ఆలయం లో ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వారం ఏర్పాట్లను నిర్వహించారు.  శ్రీ స్వామి వారి పల్లకిసేవ – ఉత్తర ద్వార దర్శనము, శ్రీ స్వామి వారి పెద్దసేవ మరియు ముక్కోటి ఏకాదశి వైశిష్ట్యత ప్రవచనం మున్నగునవి కోవిడ్ – 19 నిబంధనల మేరకు  పరిమిత సంఖ్యలో దేవస్థానం వేద పండితులు, అర్చకలు చే అంతరంగికముగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ముక్కోటి ఏకాదశి పూజలు నిర్వహించారు.  ముక్కోటి ఏకాదశి రోజున శివకేశవులను ఉత్తర ద్వారం లో దర్శించుకుంటే  ముక్కోటి దేవతలను దర్శించుకునే భాగ్యం కలుగుతదని భక్తుల ప్రగాఢ నమ్మకం, కాని కరోన మహమ్మారి పుణ్యమా ఆ భాగ్యం భక్తులకు కలుగకుండా పోయింది.ముక్కోటి సమయ పూజ అనంతరం ఉదయం 8 గంటల నుండి ఏదావిదిగా స్వామి వారి దర్శించుకోవడానికి అనుమతి కల్పించారు. కానీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా గర్భాలయం లో జరిగే అభిషేకాలు, అన్నపూజలు రద్దు చేసు కేవలం శీఘ్ర దర్శనం కలిపించారు. ఈ కార్యక్రమము లో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఆలయ అధికారులు, అర్చకులు, పరిమితి భక్తులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Triple Ekadashi celebrations in Manchiriala district