బాక్సింగ్ నేర్చుకొనే పనిలో త్రిష

Date:24/02/2018
చెన్నై ముచ్చట్లు:
కప్పుడు టాలీవుడ్, కోలివుడ్, స్యాండిల్‌పుడ్ ఇలా అన్ని భాషల్లో ఓ వెలుగు వెలిగిన నటి త్రిషకు ఇప్పుడు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. తెలుగు, తమిళంలో ఎప్పుడో అవకాశాలు చేజారిపోగా తాజాగా మళయాలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. స్టార్ హీరోతో మాత్రమే నటిస్తానని తేల్చిచెప్పడంతో కన్నడంలో కూడా ఇప్పుడు పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో చేతిలో పనిలేక ఖాళీగా ఉన్న త్రిష కొత్త విద్యలు నేర్చుకుంటోంది. టైం వేస్ట్ చేయకుండా ఎంచక్క బాక్సింగ్ నేర్చుకుంటోంది. పంచ్‌ల మీద పంచ్‌లు విసురుతోంది. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఫిట్ నెస్ కాపాడుకుంటోంది. సినిమాల కోసం ఈ పాటికే గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్న త్రిష ఇప్పుడు బాక్సింగ్‌లో రాటుదేలుతోంది. ఏమో ఎవరికి తెలుసు ఏ విద్య ఎప్పుడు, ఎక్కడ, ఎలా పనికొస్తుందో.
Tags: Trisha in boxing learning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *