జులై 27 న “మెహిని” గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న త్రిష‌

Trisha to come up with a "Mehni" on July 27

Trisha to come up with a "Mehni" on July 27

Date:17/07/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందంతో అభినయంలో ద‌శాబ్ద‌కాలం గా టాప్ హీరోయిన్ గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహిని గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మిళం లో మెహిని గా ఈచిత్రం తెర‌క‌క్కింది. అదే టైటిల్ తో తెలుగు లో కూడా రానుంది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్  ల‌క్ష్మిపిక్చ‌ర్స్ తెలుగు లో విడుద‌ల చేస్తున్నారు. ఎస్‌. ల‌క్ష్మ‌ణ్ కుమార్. శ్రినివాస‌రావు ప‌ల్లెల, క‌ర‌ణం మ‌ధుల‌త లు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మాణం చేప‌ట్టారు. ఆర్‌.మాదేష్ ద‌ర్శ‌కుడు. హ‌ర్ర‌ర్ బ్యాక్‌డ్రాప్ లో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం ట్రైల‌ర్ అంద‌ర్ని అక‌ట్టుకుంది.  ఈ చిత్రం లో త్రిష తో పాటు జాఖీ, యోగి బాబు, పూర్ణిమా భాఖ్యారాజ్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్‌.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా వుంది. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ంర ఆడియో ని విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ ఆడియోని జులై 19 న విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో జులై 27 న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ… త్రిష కి తెలుగులో ఇన్న క్రేజ్ అంద‌రికి తెలుసు.. అయితే హ‌ర్ర‌ర్ చిత్రం గా తెలుగు, త‌మిళ బాష‌ల్లో తెర‌కెక్కుతున్న మెహిని చిత్రం ఈ నెల 27 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నాము.  ఇప్ప‌టికే విడుదల చేసిన ట్రైల‌ర్ కి మాంచి క్రేజ్ రావ‌టం తో ఈ చిత్రం పై అంచ‌నాలు పెరిగాయి. విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా హ‌ర్ర‌ర్ బ్యూటి తో అంద‌ర్ని అల‌రిస్తుంది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్ తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించాడు. త్రిష ఫెర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.. న‌టిన‌టులు.. త్రిష‌, జాకి, యోగి బాబు, పూర్ణిమ భ‌ఖ్యారాజ్ త‌దిత‌రులు..
ద‌ర్శ‌కుడు.. ఆర్‌. మాధేష్‌
జులై 27 న “మెహిని” గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న త్రిష‌https://www.telugumuchatlu.com/trisha-to-come-up-with-a-mehni-on-july-27/
Tags: Trisha to come up with a “Mehni” on July 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *