విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

Date:20/05/2019

విజయవాడ ముచ్చట్లు:

కృష్ణా జిల్లాలో 980 పంచాయితీలు, 49 మండలాలు, 998 వార్డులున్నాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఆ పంచాయితీలు అన్నిటికీ ఓటర్ల జాబితాని రెడీ చేయటం జరిగిందని అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు.  మొత్తం 23,41,337 మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారు,  మగవారు 11,56,141 ఉండగా స్త్రీలు 11,85,060 ఉన్నారు. క్రిందటిసారి ఉన్న రిజర్వేషన్లు ఈసారి ఉండవు,కొత్త రిజర్వేషన్లు ప్రకారమే ఎన్నికలు ఉంటాయని అయన అన్నారు. వార్డులలో పోటీ చేసే అభ్యర్థులకి కూడా రిజర్వేషన్లు ఉంటాయి. త్వరలోనే ఎన్నికల  నోటిఫికేషన్, రిజర్వేషన్ల వివరాలు విడుదల చేస్తామని అన్నారు. ఈనెల 23 న జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసాం. మీడియా కి కవరేజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాం. కౌంటింగ్ సెంటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ ఉంది. విజయోత్సవ ర్యాలీలకి పర్మిషన్ లేదని అయన స్పష్టం చేసారు.

 

రామేశ్వరం దేవాలయంలో దొంగల బీభత్సం..

Tags: Triumphal rallies are not allowed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *