ఈనెల 11 న విజయోత్సవాలు

Date:08/12/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి దాదాపు వంద సీట్లతో భారీ విజయాన్ని సాధించనున్నామన్నారు  ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు  సంయమనం పాటించి, అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈనెల  11న విజయోత్సవాలు చేసుకుందామని టీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు ఏకపక్షంగా నిలిచారని..  ‘నిశ్శబ్ద విప్లవం’తో తీర్పు ఇచ్చారన్నారు. ప్రజలు టిఆర్ఎస్ పట్ల సానుకూల ధోరణిలో ఉన్నారని చెప్పడానికి పెద్దయెత్తున పోలింగ్ జరగడమే ఉదాహరణ అని ఆయన అన్నారు.  ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు. తామంతా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నామని అన్నారు.
పోలింగ్ సక్రమంగా పూర్తవ్వడానికి సహకరించిన ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులకు, పోలీసులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో హేమాహేమీలుగా చెప్పుకున్న.. సీఎం కుర్చీ కోసం కలలు కన్నవాళ్లు తీవ్రంగా నిరుత్సాహపడునున్నారన్నారు. వారి నియోజకవర్గాలను దాటి ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందనిఅయన వ్యాఖ్యానించారు.
 దీన్నిబట్టే వాళ్ల నమ్మకం ఎంతో తెలిసిపోయిందన్నారు కాంగ్రెస్ అంచనాలు తలకిందులు కానున్నాయని, కూటములు కట్టినా గారడీలు చేసినా ఏమీ పని కాలేదని కేటీఆర్ అన్నారు.
Tags: Triumphs on 11th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *