Natyam ad

ట్రబుల్ షూటర్స్ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. 

వీరు ఇంచార్జ్ గా తీసుకున్న అన్ని ఉప ఎన్నికల్లోను గెలుపు బాట.

చంద్రబాబు కంచుకోట కుప్పం మున్సిపాలిటీని గెలిపించుకున్న రథసారథులు…

రాబోవు ఎన్నికల్లో 63 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యం..

Post Midle

అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి..

ఉభయగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతంపై మిథున్ రెడ్డి సమీక్ష..

 

పుంగనూరు ముచ్చట్లు:

వైయస్సార్సీపీలో ట్రబుల్ షూటర్స్ గా రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్ స్పీకర్, లోకసభ వైసిపి పక్షనేత, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సిపి రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు గుర్తింపు పొందారు. వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవడంలో వీరు చేసే ఎత్తుగడలకు ప్రత్యర్థి పార్టీలు తలదించుకోవాల్సిందే. పెద్దిరెడ్డి కుటుంబ శక్తి సామర్థ్యాలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరికీ ఇవ్వనంత ప్రాథన్యత ఈ కుటుంబానికి ఇస్తున్నారంటే వీరి పవర్ ఏమిటో గుర్తించాల్సి ఉంటుంది.

 

 

రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకునే బాధ్యతలను పెద్దిరెడ్డి కుటుంబానికి అప్పగిస్తున్నారు. సీఎం అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ అన్ని ఎన్నికల్లోను గెలిచి సత్తా చాటుకున్నారు. వీళ్లు ఎక్కడ అడుగుపెడితే అక్కడ గెలుపు తప్ప ఓటమి చూడలేదు.తిరుపతి పార్లమెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తిను 2.72 లక్షల మెజార్టీతో గెలిపించుకున్నారు.బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాసరి సుధాను 90 వేల ఓట్ల మెజారిటీతోను,ఆత్మకూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి ను 88 వేల మెజార్టీతో గెలిపించారు. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్పీ చైర్మన్, కార్పొరేషన్, మునిసిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచ్ పదవులను 95 శాతనికి పైగా గెలిపించుకున్నారు. మరిముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా భావించే కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకోవడంలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు కింగ్ లుగా మారారు.

 

 

 

టీడీపీ ఆవిర్వభావం 1983 నుండి 2019 వరకు కుప్పం లో టిడిపి తప్ప మరి ఏపార్టీ గెలవలేదు. అలాంటి కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురువేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. మొత్తం 25 వార్డులకు గాను 19 వార్డుల్లో వైసిపి అభ్యర్థులు కౌన్సిలర్ గా గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ గా డాక్టర్ సుధీర్ రెడ్డి ను కుర్చీలో కూర్చోబెట్టి తండ్రి, తనయులు రథసారథులుగా మారారు. రాబోవు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకుగాను సీఎం జగన్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని వైసిపి కీలక మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇందులో సగం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. తండ్రి తనయులకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు,

 

 

 

అనంతపురం జిల్లాలోని 14 స్థానాలు, అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు అప్పగించగా, తూర్పుగోదావరి జిల్లాలోని 18 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేటాయించారు. మొత్తం 63 అసెంబ్లీ, తొమ్మిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే మంత్రి పెద్దిరెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డిలు టార్గెట్ గా పెట్టుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన టార్గెట్ ను స్వీకరిస్తూ తండ్రి,తనయలు నిత్యం ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను గెలిపించుకునే పనిలో ఉన్నారు. వీరి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీ,మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,రాజ్యసభ సభ్యులు, వైసీపీ జిల్లా అధ్యక్షులు, వైసిపి ముఖ్య నాయకులతో తరచూ భేటి అవుతూ పార్టీని పటిష్టపరుస్తున్నారు. గత నాలుగు రోజులు కిందట అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించి పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే, ఇన్చార్జ్ లతో భేటీ అయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలో గత ఆరు నెలలుగా పలు పర్యాయాలు మిథున్ రెడ్డి పర్యటించి రానున్న ఎన్నికల్లో గెలుపు పై స్థానిక నాయకులతో చర్చించారు.

 

Tags: Trouble Shooters Minister Peddireddy, MP Mithun Reddy.

Post Midle