Natyam ad

మునుగోడు రేసులో టీఆర్ఎస్, బీజేపీ

నల్గొండ ముచ్చట్లు:


న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం మీద‌  అంద‌రి దృష్టీ ప‌డింది. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తార‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఆయ‌న కూడా బిజెపీ హేమాహేమీల‌తో సంప్ర‌దించాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అంగీక‌రించ‌డంతో ఆయ‌న అతి త్వ‌ర‌లో కాంగ్రెస్‌కు టాటా చెప్ప‌డం ఖాయ‌మ‌నే భావన అందిరిలో వ్యక్తమౌతోంది. ఈ కార‌ణంగా ఇక్క‌డ ఉప ఎన్నిక‌ అనివార్యమన్న భావనతో అందరి దృష్టీ ఇప్పుడు మునుగోడుపై పడిందికాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుని చాలాకాలం నుంచీ ఆ పార్టీలోనే ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి. తెలంగాణా ఏర్ప‌డిన‌పుడు  అందలం ఎక్కిస్తారని  ఆశించారు. కానీ అది జరగలేదు. పుండు మీద కారం జల్లినట్లుగా టీపీసీపీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో ఆ పదవి ఆశించి భంగపడ్డ తనసోదరుడు కోమటి రెడ్డి కంటే రాజగోపాలరెడ్డికే ఎక్కువ ఆగ్రహం వచ్చింది.  పదే పదే తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన రాజగోపాల రెడ్డి కారణాలేమైతేనేం కాంగ్రెస్ లోనే ఉన్నారు.

 

 

 

అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇందు కోసం ఆయన బీజేపీ విధించిన షరతును అంగీకరించేందుకు కూడా సిద్ధపడ్డారని తెలుస్తోంది.  మునుగోడు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే పార్టీ సభ్యత్వం ఇస్తామనీ, రాజీనామా వల్ల ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో ఆయనను బీజేపీ టికెట్ పై గెలిపించుకుంటామనీ బీజేపీ పెద్దలు ఆయనకు చెప్పినట్లు సమాచారం.  తెలంగాణాలో పాగావేయాలంటే ఇలాంటి సీనియ‌ర్ నాయ‌కులు త‌మ పార్టీలోకి రావ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని బీజేపీ భావించ‌డంతో రాజ‌గోపాల్ రెడ్డి రాక‌ను వారూ కోరుకుంటున్నారు. తెలంగాణాలో కేసీ ఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాలంటే టీఆర్ ఎస్ పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీ వారిని వీల‌యినంత మందిని ఆక‌ట్టుకోవ‌డం, వారిని కమలం గూటికి ఆహ్వానించడం బీజేపీకి అవ‌స‌రం.  ఇపుడు తాజాగా బీజేపీకి రాజగోపాల్ రెడ్డి ద‌గ్గ‌ర‌వ‌డం పార్టీ తెలంగాణాలో టిఆర్ ఎస్‌ను దించ‌గ‌లి గేందుకు స‌త్తాను పెంచుతుందని కమలం బావిస్తోంది.   ఇదిలా ఉండ‌గా, నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది.

 

 

 

Post Midle

ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయ మనీ, దీంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తథ్యమని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోం ది. ఈ మేరకు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది. గత మూడు రోజులుగా ప్రగతి భవన్‌ నుంచే ఇందుకు సంబంధించిన వ్యూహరచన కొనసాగుతోంది. ఆగస్టు నెలాఖరుకు రాజగోపాల్‌రెడ్డి  రాజీనామా చేసేలా బీజేపీ కీలక నేతలతో చర్చ జరిగిందని టీఆర్‌ఎస్‌ నేత లు భావిస్తున్నారు. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమైన మరుసటి రోజే సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య‌ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తు మొదలైంది.

 

 

 

ఇం దులో భాగంగా  ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి కారణమైన గట్టుప్పల్‌ మండల ఏర్పాటును వెను వెంటనే ప్రకటించారు. ఆ తరువాత నియోజక వర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. ‘ఆపరేషన్‌ మునుగోడు’లో భాగంగా నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఎంపీటీసీలకు ఆదివారం హైదరాబాద్ లో మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత వేగవం తం చేయనున్నా రు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రధాని మోదీ, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కేంద్రంగా మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.

 

Tags: TRS and BJP in the previous race

Post Midle