భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ పై అంబరాన్నంటిన టిఆర్ఎస్ సంబరాలు.

కోరుట్ల  ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామంటూ అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించడం పై కోరుట్ల పట్టణ తెరాస యూత్ ఆధ్వర్యంలో  సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 91142 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక అంబెడ్కర్ చౌరస్తా వద్ద అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయి పంచి బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. అదే విదంగా విద్యార్థులచే స్థానిక అయిలాపూర్ రోడ్డులో బాణాసంచి కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో తెరాస యూత్ అధ్యక్షుల్ జాల వినోద్, కార్యదర్శి పుప్పాల నాగరాజు, ఉపాధ్యక్షులు క్యాతం సృజన్ ,బలిజ శివ, నాయకులు ఎండి సనావొద్దన్, మైనార్టీ అధ్యక్షులు ఎండి అతిక్ ,ఎండి ఆర్బాజ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొట్ట సురేందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రఘునాయక్ ,యూత్ కార్యదర్శి చిత్తరి ఆనంద్, చంద్రగిరి ,శ్రీనివాస్, నాంతబాద్ రాకేష్ ,ఎంఏ అస్లాం, ఆర్షద్ ,అప్రోజ్ ,సమీర్ ,తల్వా ,హమీద్, రిజ్వాన్ ,ఇబ్రహీం, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:TRS festivities that were heavily embarrassed over the job notification