11న టీఆర్‌ఎస్‌ కీలక సమావేశం: అదే రోజు బీ ఫారాలు పంపిణీ

Date:09/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన టీఆర్‌ఎస్‌ కీలక భేటీ జరగనుంది. ఇప్పటికే అభ్యర్థుందరికీ ఆహ్వానాలు పంపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ భవన్‌లో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం అవుతున్నారు. అదే రోజు అభ్యర్థుందరికీ బీ ఫారాలు అందించాలని నిర్ణయించారు.ఇప్పటికే 107 మంది అభ్యర్థుల పేర్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో వారంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పెండింగ్‌లో ఉన్న 12 స్థానాల అభ్యర్థులతో పాటు ఇప్పటికే ప్రకటించిన వారికి ఆ రోజు సమావేశంలో బీ ఫారాలు  అందిస్తారు. సమావేశంలో ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు. ఈనెల 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అదే రోజున ఎన్నిక ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు.
Tags; TRS key meeting on 11th: The same day distribution of Bee forms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed