టిఆర్ఎస్ నేత వట్టే జానయ్యకు హైకోర్టులో ఊరట
నల్గోండ ముచ్చట్లు:
టీఆర్ఎస్ నేత, డీసిఎంఎస్ ఛైర్మన్ వట్టే జానయ్య యాదవ్ కు హైకోర్టు లో ఊరట లభించింది. తన పైన నమోదైన అక్రమ కేసులను కొట్టివేయాలని జానయ్య హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయన 242,243,244,245 క్రైం నంబర్లు పై కేసులు నమోదు అయింది. జానయ్య పిటిషన్ పై హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, డిజిపి, ఐజీ, డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, , సీఐ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు జనయ్య పై నమోదు చేసిన కేసుల పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి ఎలాంటి కేసులు, పిడి ఆక్ట్ నమోదు చేయకూడదు అంటూ కోర్ట్ ఆదేశం ఇచ్చింది.

Tags: TRS leader Vatte Janaiah gets relief in High Court
