కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి,బండ్ల గణేశ్‌‌

TRS MLA Bhupathi Reddy, Bandula Ganesha who joined the Congress party

TRS MLA Bhupathi Reddy, Bandula Ganesha who joined the Congress party

Date:14/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు :
తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా  కప్పుకున్నారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో పాటు తెరాసకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.
అనంతరం బండ్ల గణేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ దేశం కోసం ఎంతో త్యాగం చేసిందన్నారు. తనకు కాంగ్రెస్‌ అంటే ఇష్టమని.. అందుకే ఆ పార్టీలో చేరానన్నారు. రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకే పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని కోరితే చేస్తానని.. వద్దంటే ప్రచారం మాత్రమే చేస్తానని పేర్కొన్నారు.
తాను జూబ్లీహిల్స్ టిక్కెట్‌ కోరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని గణేశ్‌ తెలిపారు. పవన్‌కల్యాణ్‌ తనకు గురువు అని… కానీ చిన్నప్పట్నుంచీ కాంగ్రెస్‌పై ఉన్న ఇష్టంతోనే ఆ పార్టీలో చేరుతున్నానన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలన్నది తన కోరికని బండ్ల గణేశ్‌ స్పష్టం చేశారు.ప్రజల కోసం పనిచేయడానికే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని ఎమ్మెల్సీ భూపతి రెడ్డి అన్నారు.
రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో హామీలు నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
Tags:TRS MLA Bhupathi Reddy, Bandula Ganesha who joined the Congress party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *