Natyam ad

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీల నిర‌స‌న‌

తెలంగాణ ముచ్చట్లు:
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు కవిత, రంజిత్‌రెడ్డి, నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోదీ వ్యాఖ్యలు సరికావన్నారు.
 
Tags; TRS MPs protest at Gandhi statue in Parliament