తెరాస గెలుపు ఖాయం

TRS victory is guaranteed

TRS victory is guaranteed

Date:26/11/2018
భువనగిరి ముచ్చట్లు:
భువనగిరి లో ఎగిరేది గులాబీ జెండా నే.  జనం ఊపు, ఉత్సాహం చూస్తుంటే పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.  తేలాల్సింది ప్రత్యర్థులకు డిపాజిట్లు వస్తాయా రావా అనేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం అయన భువనగిరిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇతర నాయకులు పాల్గోన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ వానకాలంలో ఉశిళ్ళు వచ్చినట్లే, ఎన్నికలప్పుడు కాంగ్రెసోల్లు వస్తారు.   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ టీఆరెస్.  కూటమిలో ఉన్న నాయకులకే పొంతనలేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. – వాళ్ళ పార్టీల మధ్యే ఐక్యత లేదు. ఇక పరిపాలనెం చేస్తారు.  కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ అధికారంలోకి రాదని వాళ్లకు తెలిసిపోయింది  అందుకే కాంగ్రెస్ గెలిచాక కేసీఆర్ ను జైల్లో పెడతాం అంటున్నారు.  రైతు బంధు కొనసాగాలంటే టీఆరెస్ అధికారంలోకి రావాలి.  యాదాద్రి పవర్ ప్లాంట్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బందు పెడతా నంటుండాని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెలుగుల తెలంగాణ మళ్లీ చీకటి తెలంగాణగా మారుతుంది.   భువనగిరిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నాడు మాధవరెడ్డి హయాంలో , నేడు పైళ్ల శేఖర్ రెడ్డి హయాంలోనే జరిగింది.  తెలంగాణ తెచ్చి, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ వైపా… నోటికాడి తిండినిఅడ్డుకోవాలనుకుంటున్న చంద్రబాబు కావాలో ఆలోచించుకోండని అన్నారు.
Tags:TRS victory is guaranteed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *