తెరాసకు పది సీట్లే వస్తాయి  : డీకే ఆరుణ

TRS will have ten seats:

TRS will have ten seats:

Date:08/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
కేసీఆర్ పాలనలో గ్రామాలకంటే అద్వాన్నంగా హైద్రాబాద్ లో రోడ్లు ఉన్నాయి. విశ్వనగరంగా చేస్తానన్న మాటలు ఏమైయ్యాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే  ఆంధ్రావాళ్ళు ఇక్కడి నుంచి పోతారు అన్నాడు. గ్రేటర్ ఎన్నికల్లో వాళ్ళ కాలికి ముళ్ళు కుచ్చుకుంటే పంటితో తీస్తానన్నాడు. కేసీఆర్ ఎంత అవకాశవాదో ఈ ఒక్క ఉదాహరణ చాలని కాంగ్రెస్ నేత డీకే ఆరుణ అన్నారు. సోమవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ యువత కోసమే సోనియా రాష్ట్రాన్ని ఇచ్చింది. కేసీఆర్ తన బిడ్డకు తప్పా  ఏ ఒక్క మహిళకు గౌరవం ఇవ్వరు.
కేసీఆర్ తన క్యాబినెట్ లో ఒక్క మహిళను కూడా అవకాశం ఇవ్వలేదు. సోనియా దయతో పదవిలో ఉన్న కేసీఆర్,కేటీఆర్ లు ఆమెనే అమ్మానా బొమ్మనా అంటుండఇన ఆమె మండిపడ్డారు. అధికారం కోసం ఎలాంటి గడ్డయినా తినే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ మమ్ములను,  పీసీసీ చీఫ్ ను  నోటికొచ్చినట్లు మాట్లాడితే మేము చూస్తూ ఉరుకోవాలా అని ఆమే ప్రశ్నించారు. మేము విమర్శిస్తే  తట్టుకోలేక పోతున్నారు. నా బండారం బయట పెడతానంటున్నాడు.
ఏం బండారం బయటపెడుతావో పెట్టమని అన్నారు. కేసీఆర్ ఓ దూరహంకారి. ప్రజలంతా తన బానిసలనుకుంటున్నాడు. ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ ను గద్దెదింపేందుకు నడుం బిగించాలి. కాంగ్రెస్ పాలనలో మహిళా సంఘాలకు స్వర్ణ యుగం. కేసీఆర్ పాలనలో మహిళలను పలకరించే పరిస్థితి లేదు.
బతుకమ్మ చీరలతోనే మహిళలు సరిపెట్టుకోవాలా అని ప్రశ్నించారు. మహిళల ఆత్మ గౌరవాన్ని బజారుకీడ్చిన కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలి. కేసీఆర్ ముందస్తు ఎన్నికల వల్లనే  బతుకమ్మ చీరల పంపిణీ అగుతోంది. అలంపూర్ నుంచి అదిలాబాద్ వరకు కాంగ్రెస్ గాలి వీస్తుంది. టిఆర్ఎస్ కు 100 సీట్లు రావు 10 సీట్లు మాత్రమేనని ఆమె అన్నారు.
Tags:TRS will have ten seats:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *