టీటీసీ  మేనేజ్ మెంట్ కోటా విద్యార్ధులకు అన్యాయం చేయొద్దు

-27 వేల మంది విద్యార్ధులకు న్యాయం చేయాలి…
– ప్రభుత్వ   అధికారులు  చేసిన తప్పిదాల వల్లనే విద్యార్ధులు ఇబ్బందులు

Date:30/10/2020

ఎమ్మిగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మంది టీటీసీ మేనేజ్ మెంట్  ( 2018 – 2020 ) విద్యార్ధులకు పరీక్షలకు అనుమతివ్వాలని , ఎన్ఎస్యుఐ   జిల్లా ఉపాధ్యక్షులు  వీరేష్ యాదవ్ శుక్రవారం స్థానిక కార్యాలయంలో సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపటి నెల 5 నుంచి 11 వరకు టిటిసి ఫస్టియర్ పరీక్షలు జరుగుతున్నాయని  , జీవో నెంబర్ 30 కు విరుద్ధంగా  విద్యార్థులను చేర్చుకున్న కళాశాలల  మేనేజ్మెంట్ విద్యార్థులకు పరీక్షలు  రాయకూడదని విద్యాశాఖ నిర్ణయించడం తగదని, దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో 20 వేల మంది విద్యార్థులు రోడ్డున పడే అవకాశం ఉందని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని తెలిపారు. ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అడ్మిషన్లు తీసుకున్న కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఎన్ ఎస్ యు ఐ నాయకులు భాస్కర్ అజయ్ చంద్రశేఖర్ గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు పిల్లలు, తల్లి అదృశ్యం

Tags: TTC Management Quota Do not do injustice to students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *