భక్తులకు టిటిడి విజ్ఞప్తి
తిరుమల ముచ్చట్లు:
గత ఏడాది భారీ వర్షాల కారణంగా నవంబరు 18 నుండి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శనం టికెట్లు కలిగి దర్శనం చేసుకోలేకపోయిన భక్తుల విజ్ఞప్తి మేరకు టిటిడి వారికి ఆరు నెలల్లోపు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది.అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13 నుండి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఉన్న వైకుంఠ ద్వార దర్శనం కారణంగా, ఈ తేదీలు మినహాయించి వారు మరి ఏ తేదీల్లోనైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ కి సహకరించగలరు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: TTD appeal to devotees