స్టాలిన్ విమర్శలకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండన
తిరుపతి ముచ్చట్లు:
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు.
సనాతన ధర్మం మతం కాదని,అదొక జీవన యానమని ఆయన చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని కరుణాకర రెడ్డి హెచ్చరించారు.

Tags: TTD Chairman Bhumana Karunakara Reddy condemned Stalin’s criticism
