శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి రాష్ట్ర ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఆహ్వానం
తిరుమల ముచ్చట్లు:
ఈ నెల 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.బ్రహ్మోత్సవాల తొలిరోజు ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Tags:TTD Chairman, EO, Tirupati MLA invites State Chief Minister to come to Srivari Brahmotsavam
