Natyam ad

టీటీడీ చైర్మన్, ఈవో

చే పుస్తకావిష్కరణ

తిరుపతి  ముచ్చట్లు:

Post Midle

లక్నో, అహమ్మదా బాద్ కు చెందిన ఐఐఎం ప్రొఫెసర్లు
ఎన్ రవిచంద్రన్,
వెంకటరమణయ్య సుమారు మూడు సంవత్సరాలు కృషి చేసి రాసిన ” మ్యానేజింగ్ సోషియల్ ఆర్గనైజేషన్స్ లెషన్ ఫ్రమ్ వరల్డ్ లార్జెస్ట్ పిలిగ్రమేజ్ సెంటర్” పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,ఈవో ఎవి ధర్మారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

 

ఈ సందర్బంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పుస్తక రచయితలు 2017 నుండి 2021 వరకు టీటీడీ యాజమాన్య నిర్వహణ, భక్తుల రద్దీ నిర్వహణ, దర్శనం, అన్నప్రసాద వితరణ, లడ్డూ ప్రసాదాల తయారీ , పంపిణీ లాంటి అన్ని అంశాల్లో టీటీడీ యాజమాన్య పద్ధతుల గురించి పరిశీలన జరిపి ఆ వివరాలు రాశారని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కళ్యాణ కట్ట నిర్వహణ విధానం, మహిళలు తలనీలాలు సమర్పించడానికి మహిళా క్షురకులను నియమించిన విషయాలు కూడా చక్కగా వివరించారని చెప్పారు.
కల్యాణకట్ట,అన్న ప్రసాదాల పంపిణీ , సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుకుని ఆన్లైన్లో గదులు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడం, విరాళాలు తీసుకోవడం లాంటి విషయాల్లో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీటీడీ ఎలా వాడుకుంటుందో చక్కగా రాశారని చెప్పారు. ఎంతో ఓపికతో పుస్తకం రాసిన శ్రీ రవిచంద్రన్, శ్రీ వెంకటరమణయ్య ను అభినందించారు.

 

 

అలాగే 2021 తరువాత టీటీడీ నిర్వహణ, ఆస్తులు,నగదు, బంగారం డిపాజిట్ల అంశాలపై పాలక మండలి శ్వేత పత్రం ప్రకటించిన విషయం చైర్మన్ గుర్తు చేశారు. గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత ప్రక్రుతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యాలు తయారీ లాంటి నిర్ణయాల గురించి రచయితలకు తెలియజేశారు. శ్రీపద్మావతి హృదయాలయం ఏర్పాటు, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం, విద్యుత్ వాహనాల వాడకం, ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల మంజూరు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అంశాలను చైర్మన్ వివరించారు. వీటితో పాటు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు, దాని ఉద్దేశం, 10రోజుల వైకుంఠ ద్వార దర్శనం, ఎస్సి , ఎస్టి, బిసి గ్రామాలకు చెందిన వారికి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార ఉచిత దర్శనంతో పాటు ఇతర అంశాలతో రెండవ ఎడిషన్ ముద్రించాలని చైర్మన్ కోరారు.

Tags; TTD Chairman, Evo

Post Midle