టిటిడి ఛైర్మన్, ఈవో మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Date:14/01/2019
తిరుమల ముచ్చట్లు:
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ శ్రీవారి భక్తులకు  మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అదేవిధంగా, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు స్పందిస్తూ ఆ దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి క పాకటాక్షాలతో ఈ పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Tags:TTD Chairman, Ewa Makar Sankranti wishes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed