శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష యజ్ఞం నిర్వహణకు స్థల పరిశీలన చేసిన టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరం ప్రాంగణంలో ప్రతిరోజు నిర్వహించనున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష యజ్ఞం నిర్వహణ కోసం ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్థల పరిశీలన చేశారు . ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించుకునేలా టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి సప్త గో ప్రదక్షిణ మందిరం వద్ద స్థల పరిశీలన చేశారు. వీలైనంత త్వరగా యజ్ఞం ప్రారంభించేలా అవసరమైన నిర్మాణాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ శేఖర్ రెడ్డి , టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Tags:TTD Chairman Karunakara Reddy inspected the site for the special Yajna of Sri Srinivasa Divyanugrah.
