అన్నప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు- టీటీడీ సేవలపై భక్తుల అభినందన

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్   వై వి సుబ్బారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు . అనేక మంది భక్తులతో అన్న ప్రసాదం రుచి , నాణ్యత ,వడ్డిస్తున్న విధానం గురించి అడిగారు . అన్నప్రసాదం చాలా బాగుందని భక్తులు ప్రశంసించారు . కల్యాణకట్ట , దర్శనం , వసతి కి సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగారా అని ఆరా తీశారు . భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు . శ్రీవారి సేవకులతో చైర్మన్ మాట్లాడుతూ , వారికి వసతి , సేవ పొందిన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు . అనంతరం  సుబ్బారెడ్డి భక్తులతో కలసి భోజనం చేశారు .
అన్నదానం డిప్యూటీ ఈవో  సెల్వం, ప్రత్యేకాధికారి  శాస్త్రి , ఏవీఎస్వో   సాయిగిరిధర్ చైర్మన్ వెంట ఉన్నారు.

Tags:TTD Chairman unannounced inspections at Annaprasada Building – Appreciation of devotees for TTD services

Leave A Reply

Your email address will not be published.