Natyam ad

ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్   వైవి సుబ్బారెడ్డి

– జనవరి 11వ తేదీకి పనులు పూర్తి చేయాలని ఆదేశం
– 11వ తేదీ రాత్రి నుంచి అప్ ఘాట్ రోడ్డును భక్తులకు ఉపయోగం లోకి తెస్తాం : సుబ్బారెడ్డి
 
తిరుమల ముచ్చట్లు:
 
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డును వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 11వ తేదీ రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. పనులను పర్యవేక్షిస్తున్న ఆప్కాన్ సంస్థ అధికారులు, పని చేస్తున్న కూలీలతోను చైర్మన్  సుబ్బారెడ్డి మాట్లాడారు. పనులు జరుగుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. 11వ తేదీ సాయంత్రానికి పనులు పూర్తి చేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేస్తామని చైర్మన్ తెలిపారు. 11వ తేదీ రాత్రి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఘాట్ రోడ్డు భక్తులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టు సంస్థ వారిని ఆదేశించారు. మరమ్మతు పనులు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: TTD Chairman YV Subbareddy inspecting the ghat road repair works