గో రక్షకుల మృతిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి
– మృతుల కుటుంబాలను త్వరలో పరామర్శిస్తానని ప్రకటన
తిరుపతి ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జనవరి 16వ తేదీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గో సంరక్షకులు పృథ్వి తో పాటు మరొకరు మరణించడం పట్ల టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏడుగురు గో రక్షకులు ప్రయాణిస్తున్న కారును చౌటుప్పల్ వద్ద బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో పృథ్వీ తో పాటు మరొకరు మరణించారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన నలుగురు క్షేమంగా బయట పడిన సంఘటన గురించి గోసంరక్షణ ఉద్యమ నాయకులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శివకుమార్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి వివరించారు. ఈ సంఘటన పై ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ సుబ్బారెడ్డి త్వరలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తానని చెప్పారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: TTD chairman YV Subbareddy is shocked by the death of Go defenders