పిల్లలకు  టిటిడి భక్తి భావం పెంపోదించే కార్యక్రమాలు

– ఛైర్మన్  శమంతకమణి

Date:27/02/2020

తిరుపతి ముచ్చట్లు:

టిటిడి ప్రభుత్వ గురుకుల , కస్తూరిభా పాఠశాలల్లో విద్యార్టినీ విద్యార్థులకు భక్తి భావన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని, హిందువులుగా  టిటిడి కళ్యాణమండపాల్లో పెండ్లి జరిగితే శుభం అనే భావన ప్రజల్లో వుందని వసతులు అత్యున్నతంగా వుండేలా మెరుగు పరచాలని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్ శ్రీమతి పామిడి శమంతకమణి అన్నారు. గురువారం ఉదయం స్థానిక శ్రీపద్మావతి అతిధి గృహంలో టిటిడి ఉన్నతస్థాయి  అధికారులతో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమీక్ష నిర్వహించింది.

 

 

 

ఛైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం చట్టసభల్లో  చేపట్టిన ఉత్తర్వులు 74,75 మేరకు నియామకాల్లో, రూ.5 లక్షల లోపు వున్న నామినేటెడ్ పనులలో  ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ,ప్రభుత్వ రంగల శాఖలు తప్పనిసరి పాటించాలని 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపడితేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. ఆంధ్రపదేశ్ లో తిరుమల శ్రీవారు వుందటం మనం ఇక్కడ పుట్టడం అందృష్టంగా భావించి పనులు చేయాలని నా అభిప్రాయం అన్నారు.

 

 

 

దేవాదాయ శాఖ  చట్టం  2007 మేరకు మైనారటీలు మినహా టీటీడీలో జి ఓ ల అమలు 50 శాతం అంటే 72 శాతం వుండటం  సంతృప్తిగా వుందని అన్నారు. గతంలో విఐపిలు ఉదయం వచ్చి మద్యాహ్నం శ్రీవారిని దర్శించుకుని వెళ్ళేవారని ప్రస్తుతం రాత్రి బస ఇబ్బందులు తప్పుతాయని దీనిపై సుదీర్గంగా చర్చించి నిర్ణయం టేసుకోగలిగితే మీకు భారం తగ్గే అవకాశం కలుగుతుందని అన్నారు.
సభ్యులు కోనేటి  ఆదిమూలం మాట్లాడుతూ గ్రామీణ ఎస్.సి., ఎస్.సి. కాలనీలలో గుడులు నిర్మాణం పెద్దగా చేపట్టాలని, చర్చిల నిర్మాణాలు పెరిగాయని, సత్యవేడు వెనుకబడ్డ ప్రాంతం సత్యవేడులో గానీ, సురుటుపల్లి లో గానీ కళ్యాణ మడపం నిర్మిచేందుకు  టిటిడి పరిశీలించాలని, నారాయణ వనం  వేదపాఠశాలలో ఒక్కరు కూడా చేరడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు.

సభ్యులు ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ టిటిడి కళ్యాణ మండపాలు కార్పొరేట్ స్థాయిలో వుండేలా భక్తిభావన పెంపొందించేలా తీర్చి దిద్దాలని , గతంలో అవుట్ సోర్సింగ్ లో జరిగిన రిజర్వేషన్ తప్పులను జీఓ 74,75 మేరకు సరిచేయాలని కోరారు.

 

 

సభ్యులు  శివనాధ రెడ్డి మాట్లాడుతూ 2007 లో జమ్మలమడుగులో ఆలయం విలీనం సంధర్భంగా దేవాదాయ శాఖ వేలం వేసిన భూముల రిజిష్ట్రేషన్ జరగడం లేదని, బస్టాండు కూడల్లో వున్న టిటిడి షాపింగ్ కాంప్లెక్స్ శిధిలావస్థకు చేరిందని పరిశీలించాలని కోరారు.
సభ్యులు కంతేటి సూర్యనారాయణ రాజు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి , కారణ బలరామ కృష్ణమూర్తి  మాట్లాడుతూ గతంలో వున్న పగలు విఐపి దర్శనాలు పునరుద్దరిస్తే ఏ రోజూకారోజు వెళ్లిపోతే తాకిడి తగ్గే అవకాశం కలుగుతుందని ఉదయం విమానాల్లో వచ్చే వాళ్ళు ఆదేరోజు వెల్ల గలుగుతారని పరిశీలించాలని కోరారు. గతంలో ప్రముఖులు బస చేసే స్పెషల్ టైప్ వసతి గృహాల పరిస్తితి బాగా లేదని , వాటికి గత వైభవం తీసుకురావాలని,   ప్రస్తుతం తిరుమలలో  35 వేలమందికి మాత్రమే వసతి కలదని పెంచడానికి టిటిడి చర్యలు కోరగా..

టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ వివరిస్తూ తిరుమలలో ఇకపై కొత్త సముదాయాలు నిర్మిస్తే పచ్చదనం, పొల్యూషన్ పెరుగుతుందనే వుద్దేశంతో అలిపిరి వద్ద 40 ఎకరాల్లో 30 వేలమందికి వసతి కలిగే నిర్మాణాలకు శ్రీకారం చుట్టి అక్కడ బస చేస్తే ఉచిత రవాణా అందిచనున్నామని వివరించారు. పగలు విఐపి దర్శనాలపై బోర్డు ముందు వుంచతామని హామీ ఇచ్చారు.

కమిటీకి టిటిడి అడిషనల్ ఇఒ ధర్మారెడ్డి, జెఇఒ బసంత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా టిటిడి భక్తులకు చేపడుతున్న వసతులు  , హిందు ధర్మ పరిరక్షణ, వైద్య , విద్యా  కార్యక్రమాలు  కమిటీకి వివరించారు.ఈ కమిటీ సమీక్షలో టిటిడి ఉన్నతాధికారులు అసిస్టెంట్ సెక్రటరీ సుబ్బారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

పోలీసులపై చంద్రబాబు ఫైర్

Tags: TTD devotional programs for children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *