టీటీడీ ఉద్యోగులకు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇంటిపట్టాలు
తిరుపతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలోనే ఉద్యోగులకు ఇంటిపట్టాలు ఇస్తాం.సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కృషి చేస్తాం.స్వాత్రంత్ర దినోత్సవ వేడుకల సభలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అంతర్గత ఇబ్బందులు విడనాడి ఏకంగా తమకు సహకరించాలని ఆయన కోరారు.

వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో కలసి ఆయన పరిశీలించారు. సెప్టెంబరు18వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. అవసరమైతే మరో 100 ఎకరాలైన ప్రంభుత్వం నుండి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చైర్మన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉద్యోగులు ఒక్క సారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, తాను ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకునే వారమని కరుణాకర్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండటం. వల్లే ఉద్యోగులందరికీ ఇంటిస్థలాలు వస్తున్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
Tags: TTD employees under the leadership of YS Jaganmohan Reddy
