Natyam ad

విద్యార్థుల‌ను అభినందించిన టీటీడీ ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల ముచ్చట్లు:

10వ త‌ర‌గ‌తి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన‌ విద్యార్థుల‌ను అభినందించిన టీటీడీ ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి.    టీటీడీ పాఠశాలల్లో చదువుతూ 10వ త‌ర‌గ‌తి ( 2023-24) పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు టీటీడీ పరిపాలన భవనంలో గురువారం  టీటీడీ ఈవో  ఏవి ధర్మారెడ్డి మెమొంటోలను బహూకరించి అభినందించి, ఆశీర్వదించారు.       అదేవిధంగా జేఈవోలు  గౌతమి (విద్య మరియు వైద్యం),  వీరబ్రహ్మం టీటీడీ విద్యాశాఖాధికారి డా.భాస్కర్ రెడ్డి టీటీడీ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచిన మరియు 570కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాలలో ఆరుగురు, ఎస్వీ  ఉన్నత పాఠ‌శాల నుండి నలుగురు, శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల నుండి నలుగురు, శ్రీ గోవిందరాజ స్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాల, తిరుమల ఎస్వీ ఉన్నత పాఠశాల, శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నత పాఠశాల, ఎస్వీ ఓరియంటల్ ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌,  భీమవరంలోని ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌ నుంచి ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం 20 మంది విద్యార్థులు ఈవో చేతుల మీదగా మెమొంటోలు అందుకున్నారు.     టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న అన్ని పాఠశాలల్లో  2023 -2024 విద్యా సంవ‌త్స‌రం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 98 శాతం, తిరుప‌తిలోని ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, భీమవరంలోని ఎస్వీ బ‌ధిర‌ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని టీటీడీ విద్యాశాఖాధికారి డా. భాస్కర్ రెడ్డి తెలియజేశారు.        ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post Midle

Tags: TTD EO AV Dharma Reddy congratulated the students

Post Midle