ఎస్వీ విశ్రాంతిగృహాన్ని పరిశీలించిన టిటిడి ఈవో

TTD EOW examined the rest of the housing estate

Date:26/03/2019

తిరుమల ముచ్చట్లు

టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉదయం తిరుపతి జెఈవో   బి.లక్ష్మీకాంతంతో కలిసి తిరుపతిలోని ఎస్వీ విశ్రాంతిగృహాన్ని పరిశీలించారు. అక్కడ గదులను పరిశీలించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గదుల ధరలు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈ 4 శ్రీ రాములు , డిప్యూటీ ఈవో లక్ష్మీ నరసమ్మ , డిఇ రవిశంకర్ రెడ్డి , ఈఈ కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

టిటిడి ఉద్యోగుల క్వార్టర్స్‌ను పరిశీలించిన జెఈవో :

టిటిడి ఉద్యోగులు నివాసముంటున్న వినాయక నగర్‌, రామ్‌నగర్‌, గోవిందరాజనగర్‌, కెటి క్వార్టర్స్‌ ప్రాంతాలను, పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌ను తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం పరిశీలించారు.

క్వార్టర్ల వారీగా పరిశీలించి సత్వరం చేపట్టాల్సిన పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. లీకేజీలను అరికట్టాలని, డ్రైనేజీ మరమ్మతులు చేపట్టాలని, ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా అన్ని క్వార్టర్లలో గేట్లు ఏర్పాటు చేయాలని, సిసి కెమెరాలు అమర్చాలని, సెక్యూరిటి సిబ్బందిని నియమించాలని విఎస్‌వోకు సూచించారు. దోమల నివారణకు మెష్‌లు, ఇతర చర్యలు చేపట్టాలని, రోడ్లు వేయాలని, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని అధికారులను కోరారు. క్వార్టర్స్‌లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం కార్పొరేషన్‌ కమిషనర్‌తో చర్చించామని తెలిపారు. ఉద్యోగుల క్యాంటీన్‌లో మరింత రుచికరమైన అన్నప్రసాదాలను అందించాలన్నారు. సాయంత్రం స్నాక్స్‌ లో మరిన్ని ఆహారపదార్థాలను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని అన్నప్రసాదం అధికారులకు సూచించారు.

 

 

 

 

 

 

 

 

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-1  రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ-4  ఎ.రాములు, విఎస్‌వో  అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఇఇ  మనోహరం, డిఇ  రవిశంకర్‌రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి   వేణుగోపాల్‌, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా.. సునీల్‌కుమార్‌, ఎవిఎస్వో రాజేష్‌ ఇతర అధికారులు ఉన్నారు.

బాలయ్య కోసం భార్య ప్రచారం

Tags:TTD EOW examined the rest of the housing estate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *