– బేజారు పడుతున్న భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమల ముచ్చట్లు:
గత ఐదు సంవత్సరాల నుండీ తిరుమల పవిత్రతను గాలికి వదిలేసిన టీటీడీ.కనీస నిబంధనలు పాటించని టీటీడీ బోర్డ్.విచ్చల విడిగా రూల్స్ బ్రేక్ చేస్తూన్న పట్టించుకుని నాథుడు కరువయ్యాడు. చైర్మన్ స్థాయి లో ఉంటూ కనీస స్పందన లేకుండా ఉంటున్న భూమన కరుణాకర్ రెడ్డి. వారానికి మూడుసార్లు తిరుమల అంతరాలయం పై నుండీ విమానాలు ప్రయాణం. తిరుమల పవిత్రతను భంగం కలిగిస్తున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడే విషయంలో టీటీడీ ఎప్పుడూ వెనుకబడుతూనే .గతంలో చిన్న విమానాలు నో ఫ్లైజోన్ అయిన ఆలయంపై ఎగిరినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అత్యంత సమీపంలో హెలికాఫ్టర్లు ప్రయాణం చేయడం దురదృష్టకం.ఈ హెలికాఫ్టర్లు ఎవరివి అన్నదానిపై స్పష్టత లేదు. ఇటీవల డ్రోన్ షాట్స్ దృశ్యాలు , ఆలయంలో సెల్ ఫోన్‌తో షూట్ చేసిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా శ్రీవారి ఆలయ పవిత్రకు భంగం కలిగేలా ఘటనలు చోటు చేసుకోలేదు.వీటిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా టీటీడీ మాత్రం పట్టించుకోవడం లేదు.
Tags:TTD has left the sanctity of Tirumala to the winds