నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత
తిరుపతి ముచ్చట్లు:
చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న మంగళవారం ఉదయం 8.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేస్తారు. స్థానికాలయాల్లో ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించాలని కోరడమైనది.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఈ మేరకు ఆలయ కార్యక్రమాలు జరుగుతాయి.తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు అలంకారం, సహస్రనామార్చన, నివేదన, దీపారాధన, రాత్రి 10 నుండి 10.15 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

Tags:TTD local temples closed due to lunar eclipse on November 8
