TTD outsourcing staff protest with black badges

టిటిడి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన

Date:25/05/2020

తిరుమల ముచ్చట్లు:

టిటిడిలోని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. టిటిడి పరిపాలనా భవనంతో పాటు తిరుపతిలోని టీటీడీ సంస్థల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది.టిటిడి పరిపాలనా భవనం, సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్, రవాణా విభాగం, ముద్రణాలయం, చీఫ్ ఎడిటర్ కార్యాలయం, సేల్స్ వింగ్, బర్డ్, s.v. ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద ఆసుపత్రి, కేంద్రీయ వైద్యశాల, శ్రవణం, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్వేతా భవనం, అన్న ప్రసాదం విభాగం, ఉద్యానవన విభాగం, విద్యా విభాగం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల హాస్టళ్లు, ఎస్వీ పూర్ హోమ్, తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాలు, శ్రీనివాసమంగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీ తదితర ప్రాంతాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు నిరసన చేపట్టారు.ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్య‌క్షుడు ఎం.నాగార్జున, టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సుబ్ర‌మ‌ణ్యం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు హరిప్రసాద్, నవీన్, రూప్ కుమార్, హరి, నిరంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

నాగుపాము.. చన్నీటి స్నానం

Tags: TTD outsourcing staff protest with black badges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *