TTD Saree is for Chandragiri Sri

చంద్ర‌గిరి శ్రీ మూల‌స్థాన ఎల్ల‌మ్మ‌కు టిటిడి సారె

Date:17/01/2020

చంద్ర‌గిరి ముచ్చట్లు:

చంద్ర‌గిరిలోని శ్రీ మూల‌స్థాన ఎల్ల‌మ్మ‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం టిటిడి తరఫున టిటిడి బోర్డు ఎక్స్ ఆఫిషియో స‌భ్యులు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే, తుడ ఛైర్మ‌న్‌, ప్ర‌భుత్వ విప్ అయిన డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి సారె సమర్పించారు. అంత‌కుముందు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి వ‌చ్చిన‌ సారెను చంద్ర‌గిరిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంకు తీసుకువ‌చ్చి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

 

ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను  మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్ళి అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.ఈ సందర్భంగా డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ  ప్రతి ఏటా సంక్రాంతి మ‌హోత్స‌వాల‌లో భాగంగా అమ్మవారికి టిటిడి సారెసమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం టిటిడి త‌ర‌పున అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు.

 

 

ఈ కార్యక్రమంలో స్థానిక ఆల‌యాల డెప్యూటీ ఈవో  సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ‌వారి ఆల‌య పేష్క‌ర్   లోక‌నాథం, చంద్ర‌గిరి శ్రీ మూల‌స్థాన ఎల్ల‌మ్మ ఆలయ పాలకమండలి అధ్యక్షులు శ్రీ శివ‌శంక‌ర్‌రెడ్డి, ఆల‌య ఈవో  రామ‌కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tags: TTD Saree is for Chandragiri Sri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *