Natyam ad

శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల్లో టీటీడీ ఆల‌యాల‌ ఫ్లెక్సీలు

– ప్రత్యేక ఆకర్షణగా టీటీడీ పుస్తక విక్రయశాల

 

ఒంటిమిట్ట‌ ముచ్చట్లు:

Post Midle

ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీటీడీ ఆల‌యాల విశేషాలు, చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే ఫ్లెక్సీలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న 70 టీటీడీ ఆల‌యాల చ‌రిత్ర‌, ఫోటోల‌తో కూడిన ఫ్లెక్సీలు భ‌క్తి భావాన్ని పెంచుతున్నాయి.అదేవిధంగా ఒంటిమిట్ట ఆల‌య చ‌రిత్ర‌, శిల్ప‌క‌ళ‌, వాహ‌న‌సేవ‌లు త‌దిత‌ర అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌ను ఆధిక సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

 

ప్రత్యేక ఆకర్షణగా టీటీడీ పుస్తక విక్రయశాల

ఆల‌య ప్రాంగ‌ణంలో టీటీడీ పుస్తక విక్రయశాలను ఏర్పాటుచేశారు. ఉదయం 8 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక విక్రయశాల తెరిచి ఉంటుంది.ఇందులో పలు ఆధ్యాత్మిక గ్రంథాలు, శ్రీవారి ఆలయ చరిత్రను, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే పుస్తకాలు, శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర పంచాగం, అగ‌ర‌బ‌త్తులు అందుబాటులో ఉన్నాయి.అదేవిధంగా పుస్తక విక్రయశాలలో అపురూపమైన శ్రీమదాంధ్ర మహాభారతం, పోతన భాగవతం వాల్మీకి రామాయణంతో పాటు హరికొలువు, సిరికొలువు తదితర పుస్తకాలు కలిపి మొత్తం 150 తెలుగు ప్రచురణలు ఉన్నాయి. తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషలు కలిపి మొత్తం 120 ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి.

Tags:TTD Temples Flexi Performances Entertaining in Brahmotsavari of Sri Kodandaramaswamy

Post Midle