సత్యవేడు లో టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు..!

-ఉత్తర్వులు జారీ చేసిన వై.వి.సుబ్బారెడ్డి..!

-ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదిమూలం విన్నపం పై హామీ ఇచ్చిన వైవి

-మాట నిలబెట్టుకున్న టిటిడి చైర్మన్ పై ప్రశంసల జల్లు

సత్యవేడు ముచ్చట్లు :

 

 

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మరోసారి తన మాటను నిలబెట్టుకుని సత్యవేడు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా సత్యవేడు మండల కేంద్రంలో మంత్రి కొడాలి నాని సారథ్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వైవీ సుబ్బారెడ్డి ని నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు లో టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం బహిరంగ సభ ద్వారా వినతి పత్రం సమర్పించి విన్నవించారు. దీనిపై వెంటనే స్పందించిన వైవీ సుబ్బారెడ్డి తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు వెలువడే గానే టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని బహిరంగ సభ ద్వారా హామీ ఇచ్చారు. హామీ మేరకు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడి నెలలు కాకముందే ఇచ్చిన మాట ప్రకారం టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో టిటిడి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు.. దీనిపై స్పందించిన స్థానిక సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తన విన్నపం పై బహిరంగ సభ ద్వారా హామీ ఇచ్చిన సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను అమలు చేయడంలో అందరికన్నా మేటి అని, ఎన్నో ఏళ్లుగా సత్యవేడు మండల ప్రజల కలగానే మిగిలి పోయిన కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వై వి సుబ్బారెడ్డి కి ఎమ్మెల్యే అయినా తనతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ రుణపడి ఉంటామని ఆయన కృతజ్ఞతలు తెలిపారు… ఈ కార్యక్రమంలో నారాయణవనం సింగిల్ విండో ప్రెసిడెంట్ కోనేటి సుమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: TTD welfare mandapam set up in Satyavedu ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *