తులసీ రెడ్డి రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందాలి
కడప ముచ్చట్లు:
తమ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసీ రెడ్డి పార్టీ లో మరింత ఉన్నత స్థాయికి ఎదుగాలని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీకటి చార్లెస్ ఆశాభావం వ్యక్తంచేశారు సోమవారం తులసీ రెడ్డి జన్మదిన వేడుకలు వేంపల్లి లో ని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చార్లెస్ తులసీ రెడ్డి కి పూల మాల వేసి పండ్లు,బుకే అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం చీకటి చార్లెస్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు రాజకీయాల్లో బాగా రాణించాలని కోరారు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది ప్రజా సేవకు అంకితం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కర్నాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు షేక్ గౌషియా, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె లక్ష్మయ్య, ఎన్ ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు యం బాబు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పెనుబాల ఓబులేసు, గంగాధర్,హజరతయ్య, మైనారిటీ నాయకులు మహబూబ్ పీరా తదితరులు పాల్గొన్నారు.
Tags: Tulsi Reddy should get high positions in politics