షర్మిల పార్టీలో కలకలం

హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో పార్టీ పెట్టక ముందే షర్మిలకు షాక్ ఇచ్చారు ఆమె నేతలు. వైఎస్ పాలన తెలంగాణలో తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. వచ్చేనెల పార్టీ ప్రకటన చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో పార్టీ రాక ముందే… ఆమె వర్గంలో కలకలం రేగింది. పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం ఆమె ఇప్పటికే అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్‌హాక్ కమీటీలో ఉన్న కొందరు వైఎస్సార్ అభిమానలు రాజీనామాలు చేస్తున్నారు.మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హాక్ కమిటీకి రాజీనామా చేశారు. ఇదేబాటలో మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు కాకముందే ఏర్పడిన ముసలంను మరి షర్మిల ఏ విధంగా చక్కదిద్దుతారో చూడాలి.మరోవైపు వైఎస్ షర్మిల రేపు నల్గోండ జిల్లా హుజూర్‌నగర్ లో పర్యటించనున్నారు. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న నీలకంఠసాయి అనే యువకుడిని షర్మిల పరామర్శించనున్నారు. సూసైడ్ చేసుకుని చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేర్చటంతో నీలకంఠసాయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. చికిత్స పొంది ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Turmoil at Sharmila’s party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *