పార్లమెంటు కమిటీలో బీదాదే పై చెయ్యి

-కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కి మొండి చెయ్యి

 

నెల్లూరుముచ్చట్లు:

.
ఎంతోకాలంగా పెండింగ్ లో వున్న  తెలుగుదేశంపార్టీ నెల్లూరు పార్లమెంట్ కమిటీ నియామకాలు ఎట్టకేలకు జరిగాయి. తెలుగుదేశంపార్టీ అధినేత , ఆపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు అధిష్టానం బుధవారం నెల్లూరు పార్లమెంటు కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో కావలి నియోజకవర్గం నుండి తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యదర్శి , మాజీ శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర వర్గానికే అధిష్టానం అన్ని పదవులు కట్టబెట్టింది. మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి వర్గానికి మొండి చేయి చూపింది. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నుండి బీదా , కాటంరెడ్డి వర్గాలమధ్య పచ్చగడ్డి భగ్గుమనే వైరం కొనసాగుతూవస్తున్న విషయం తెలిసిందే . ఇరువర్గాలు ” ఎవరికివారే యమునాతీరే ” అన్నరీతిలో ఎన్టీఆర్ జయంతి –  వర్ధంతి లను , ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలను వేరువేరుగానే నిర్వహిస్తూ వస్తున్నారు. 2 వర్గాల నడుమ నెలకొనివున్న వైరివాతావరణాన్ని సరిదిద్దే చర్యలు ఇంతవరకూ అధిష్టానంగాని , జిల్లా నాయకులుగాని చేపట్టిన దాఖలాలు లేవు . ఈసారి నెల్లూరు పార్లమెంటు కమిటీ లో కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి వర్గంలోని కొందరికి చోటు లభించవచ్చునని వినవచ్చిన ఊహాగానాలు ఊహాగానాలుగానే మిగిలాయి . కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి వర్గాన్ని అధిష్టానం అసలు పరిగణలోకే తీసుకోలేదని విడుదలైన కమిటీ జాబితా చెప్పకనేచెబుతోంది.

 

 

 

ఇక నెల్లూరు పార్లమెంటు కమిటీలో కావలి నియోజకవర్గానికి లభించిన  పదవులు చూస్తే – మళ్ళీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్ష పదవి మన్నవ రవిచంద్రను వరించింది. తెలుగుదేశం పార్టీని 1982 లో ఎన్టీఆర్ ప్రారంభించిననాటినుండి  రవిచంద్ర ఆపార్టీలో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే . దీన్ని బట్టి అధిష్టానం సీనియర్ల వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తుంది . అలాగే పార్టీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్ గా పెద్ద ఎన్టీఆర్ కి , నందమూరి బాలకృష్ణకి వీరవిధేయుడు అయిన బొగ్గవరపు శ్రీనివాసులు ( అన్నపూర్ణా శ్రీను ) కు కమిటీలో చోటుదక్కింది . ఆ నియామకం కూడా అంతే .  ఆయనకూడా మొదటినుండి తెలుగుదేశం పార్టీ జెండానే మోస్తూ వస్తున్నాడు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమింపబడ్డ డాక్టర్ వేగూరి చంద్రశేఖర్ , సెక్రటరీలుగా నియమితులైన కోడూరు వెంకటేశ్వర రెడ్డి, బెల్లంకొండ శ్రీనివాసులు, ట్రెజరర్ పాలగాటి శ్రీనివాసులురెడ్డి అందరూ కూడా బీదా రవిచంద్ర వర్గీయులే .

 

 

 

 

దీన్నిబట్టి నెల్లూరు పార్లమెంటు కమిటీలో తన వర్గీయులకు పదవులు ఇప్పించుకోవడంలో బీదారవిచంద్ర సఫలీకృతం అయ్యాడని అనుకోవాల్సివస్తుంది . అలాగే కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి పార్టీకి చేసే సేవలను అధిష్టానం గుర్తించడంలేదని , పార్టీలో ఆయనకు గాని , ఆయన వర్గానికిగాని పెద్దగా ప్రాధాన్యత అధిష్టానం ఇవ్వడంలేదని  భావించాల్సివస్తుంది .
త్వరలో విడుదల కాబోయే కావలి రూరల్ , అల్లూరు, దగదర్తి  బోగోలు మండలాల కమిటీల్లోనూ,  కావలి పట్టణ కమిటీ లోనూ అధిష్టానం  బీదా రవిచంద్ర వర్గీయులకే ప్రాధాన్యత కల్పించేపరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Turn your back on the parliamentary committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *