Natyam ad

టీవీ పేలి జవాను మృతి

తిరుపతి ముచ్చట్లు:
 
సి.ఆర్. ఎఫ్ జవాను ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి టివి పేలడంతో సి. ఆర్. పి. ఎఫ్ జవాను మృతి చెందాడు. అలాగే అతని భార్య శరీరం కూడా పూర్తిగా కాలింది. తిరుపతి పట్టణంలోని సైనిక్ నగరులో సోమవారం ఉదయం సీఆర్పీఎఫ్ జవాను బి. నాగేశ్వర నాయక్ (46), అతని భార్య బి. సిద్దేశ్వరి (38) ఇంట్లో టివి చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు శబ్దం విన్న స్థానికులు గ్యాస్ సిలిండర్ పేలి, మంటలు వస్తున్నాయని భావించి, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. పోలీసుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది గాయపడిన మహిళను, మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో నాగేశ్వర నాయక్ శరీరం పూర్తిగా కాలి ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. అతని భార్య సిద్దేశ్వరి తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతుండగా ఎస్ఐ తిప్పేస్వామి తన వాహనంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అలాగే మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తీసుకు వచ్చారు. బాధితురాలు నుంచి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, తహశీల్డారు జి. రవి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బాధితులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలి టిటిసి చేస్తోంది. రెండో కుమార్తె శ్రీచైతన్య బిఎస్సీ నర్సింగ్ చదువుతోంది. కుమారుడు విష్ణు కుమార్ నాయక్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; TV blast kills Javanese