Two arrested for moving alcohol, two two-wheelers seized

మద్యం తరలిస్తున్న ఇద్దరుఅరెస్ట్, రెండు ద్విచక్ర వాహనాల సీజ్

Date:13/07/2020

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని శ్రీనివాసపురం రోడ్డు కర్ణాటక సరిహద్దుల్లోని ఏ . కొత్తూరు చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ ఐ రవి కుమార్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా, మళబాగల్ తాలూకు అగరం గ్రామానికి చెందిన సంతోష్ 96 మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకుని కేసునమోదు చేసి ద్విచక్ర వాహనం సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. అలాగే రామసముద్రం మండలం ఆర్ నడింపల్లెకు చెందిన మునివెంకటప్ప కుమారుడు వాలప్ప నుంచి 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుండి మద్యం తో పాటు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కర్ణాటక నుంచి అక్రమ మద్యం రవాణా కాకుండా ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్ఐ తెలిపారు.

జర్నలిస్టు పార్థసారథి కుటుంబానికి మంత్రి పెద్ది రెడ్డి ఆర్థిక సహాయం

Tags:Two arrested for moving alcohol, two two-wheelers seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *