Natyam ad

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్..

–రూ.70 వేల విలువైన మద్యం సహా బైక్ సీజ్..
— నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించిన సీఐ ఎన్.శేఖర్.

 

మదనపల్లె ముచ్చట్లు:

Post Midle

ద్విచక్ర వాహనంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి నిద్దతులను మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ ఎన్.శేఖర్ ఎస్ఐ లు వెంకటేష్, రవికుమార్ గురువారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మదనపల్లి మండలం చికిల బైలుకు చెందిన నరసింహులు కుమారుడు మండెం నవీన్ (29), గంగరాజు కుమారుడు నాగినేని శ్రీనివాసులు(30) కర్ణాటక రాష్ట్రం నుంచి 7 కేసుల కర్ణాటక మద్యం ద్విచక్ర వాహనంలో తీసుకొని చీకలబైలుకు వస్తున్నట్లు మందస్తు సమాచారం అందిందన్నారు. వెంటనే చీకలబైలు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ లో వస్తున్న మద్యం తరలిస్తున్న నిందితులు మేడిపల్లి అడవి మార్గంలో వెళుతు పట్టుబడ్డారని చెప్పారు. పట్టుబడిన వారి నుంచి కర్ణాటక మద్యం సీజ్ చేసి వారిని మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారణ అనంతరం అక్రమ మద్యం తరలింపు పై కేసు నమోదు చేసి అరెస్టు చేసామని సీఐ తెలిపారు.

 

Tags; Two arrested for transporting liquor in Karnataka..

Post Midle