పోలీసుల దాడి కేసులో ఇద్దరు అరెస్ట్
పుంగనూరు ముచ్చట్లు:
ఆగస్టు 4న చంద్రబాబు పర్యటనలో పోలీసులపై దాడులు చేసి , వాహనాలను దగ్ధం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ దాడి కేసులో మండలంలోని నడింగడదేశికి చెందిన న్యాయవాది ఎల్.నవీన్‌కుమార్‌ను, కంగానెల్లూరు గ్రామానికి చెందిన చెన్నకేశవులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారని , వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags: Two arrested in police attack case
