శ్రీనివాస్ రెడ్డి హత్య కేసులో ఇద్దరు ఆరెస్టు

పామర్రు ముచ్చట్లు:

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం అళ్ళవారిపాలెం లో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి హత్య కేసును పోలీసులు  ఛేదించారు. హత్య సూత్రధారులు ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, ఆళ్ల మిధునను అరెస్టు చేసారు. సోమవారం నాడు పోలీసులు హత్య వివరాలు వెల్లడించారు. వర్క్ ఫ్రం హోం లో ఉన్న మృతుడు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆప్త మిత్రులు. శ్రీకాంత్ రెడ్డి సెల్ ఫోన్ ఫార్మాట్ చేసే క్రమంలో ఆయన ప్రియురాలు మిధునతో కలిసి ఉన్న న్యూడ్ ఫోటోలను మృతుడు లు చూసాడు. మీ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా అంటూ మిధునను మృతుడు బెదిరించి లోబరుచుకున్నాడు. విషయం తెలుసుకొని శ్రీకాంత్ అనేకసార్లు స్నేహితుడిని హెచ్చరించాడు. శ్రీనివాస్ రెడ్డిలో మార్పు రాకపోవడంతో పథకం ప్రకారం ఇంటికి పిలిపించి అతడిని హత్య చేసారు.

 

Tags: Two arrested in Srinivas Reddy murder case

Leave A Reply

Your email address will not be published.