Two arrested with 15 liters of Sara

105 లీటర్ల సారాతో ఇద్దరు అరెస్ట్

Date:08/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

అక్రమంగా 105 లీటర్ల సారాను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పట్టణ సీఐ గంగిరెడ్డితో కలసి మండలంలోని పట్రపల్లె వద్ద గల హంద్రీనీవా కాలువ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మదనపల్లెకు చెందిన సురేష్‌, షేక్‌ ముభారక్‌లు సారా తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు సారాను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే జెడితాండాలలో నాటుసారా బట్టీలను ధ్వంసం చేసి , 95 లీటర్ల సారాను, రెండు ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశామన్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు ఉమామహేశ్వరరావు, సరితారెడ్డి, అంజనేయులు, ఎస్‌వి.రమణ , సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

మహిళల రుణాలు వసూలు మూడు నెలలు వాయిదా

Tags: Two arrested with 15 liters of Sara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *