Natyam ad

పిటీఎంలో రెండు బైకులు ఢీ.. అరుగురికితీవ్ర గాయాలు

పిటీఎం ముచ్చట్లు:

పిటీఎం కుమ్మరపల్లిలో రెండు బైకులు ఎదురెదురు ఢీకొని అరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసుల కథనం. పీటీఎం మద్దయ్యగారిపల్లికి చెందిన వి. చిరంజీవి(45) తన కొడుకులు శివసాయి(13), వినోద్ (15) లకు జ్వరం వస్తోందని గురువారం బి. కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి బైకులో బయలుదేరారు. స్కూటర్ మార్గ మధ్యంలోని కుమ్మరపల్లి వద్దకు రాగానే, కుమ్మరి పల్లికి చెందిన ముగ్గురు యువకులు బైకులో వేగంగా వస్తూ చిరంజీవి బైకును ఢీకొన్నారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రి బిడ్డలతో పాటు ఆపొసిట్ బైకులోని ముగ్గురు మొత్తం అరుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చిరంజీవి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.. గాయపడ్డవారిలో చిరంజీవి పరిస్థితి విషమంగా ఉంది. పీటీఎం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Two bikes collided in PTM.. 10 seriously injured

Post Midle